ఆత్మకూరు వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితుడు
పయనించే సూర్యుడు నవంబర్ 27 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం బోడిపాడు గ్రామానికి చెందిన నాగిరెడ్డి చెంచురామిరెడ్డి పై అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బుధవారం దాడి చేసినట్లు చేజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు నాగిరెడ్డి చెంచురామిరెడ్డి కి చెందిన భూమి సర్వేనెంబర్ 416,1 డి లో మూడు ఎకరాల 26 సెంట్లు భూమి ఉంది.ఈ భూమిపై ఆత్మకూరు సివిల్ కోర్టులో తాత్కాలిక ఇంజక్షన్ పొంది ఉన్నాడు. అయినప్పటికీ ఆయన తన భూమిలో వ్యవసాయ పనులు చేస్తుండగా బోయిళ్ళ రవీందర్ రెడ్డి మరో ఇద్దరు కలిసి దాడి చేసినట్లు ఫిర్యాదుల పేర్కొన్నారు. ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు. బాధితులు తెలిపారు