Friday, October 24, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆదివాసులను బెదిరింపులకు గురిచేస్తున్న బొడ్డు చందర్రావు అనే వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు...

ఆదివాసులను బెదిరింపులకు గురిచేస్తున్న బొడ్డు చందర్రావు అనే వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.నాన్ ట్రైబల్ భూములు రక్షణ కొరకు ఉత్తర్వులు ఇస్తారు.మరి ఏజెన్సీ చట్టాలు అమలు కొరకు ఆదేశాలు ఎందుకు చేయరు.

Listen to this article

చింతూరు పిఓ కం సబ్ కలెక్టర్ వారిని ప్రశ్నించిన ఆదివాసి సంక్షేమ పరిషత్.

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి.నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 1

. బుధవారం నాడు కుసుమనపల్లి గ్రామంలో ఆదివాసి ప్రజల తోటి సర్పంచ్ మోసం రాజులు నిర్వహించిన సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను హాజరై మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటపాక మండలం నందిగామ గ్రామ నికి చెందిన బొడ్డు చందర్రావు అనే నాన్ ట్రైబల్ ఏజెన్సీ ప్రాంతాల్లో వేలాది ఎకరాల ఆదివాసి భూముల్లో ఆదివాసి చట్టాలను తుంగలోకి తొక్కి అమ్మాయక ఆదివాసులు మోసం చేస్తూ తక్కువ రేట్లకే జామాయిల్ వ్యవసాయం చేస్తున్నారని, పంట నరికిన తర్వాత ఆదివాసులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని మోసం చేయడం జరుగుతుందని అన్నారు. ఆదివాసుల పక్షాన ఎవరైనా మాట్లాడితే వారి మీద పోలీస్ కేసులు పెడతామని బెదిరించడం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. సర్పంచ్ అయినా మోసం రాజులు పై కూడా ఎటపాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి బెదిరింపులకు గురిచేసినట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఎర్ర బోరు వినాయకపురం పట్టు చీర నల్లకుంట కన్నాపురం విస్సాపురం గర్భకుంట, కుసుమనపల్లి మొదలగు ఎన్నో గ్రామాల్లో బొడ్డు చందర్రావు అనే వ్యక్తి ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా జమాల్ సాగు చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. కేవలం ఈ ఒక్క వ్యక్తి మాత్రమే కాదని ఏజెన్సీ ప్రాంతాల్లో వేలాది ఎకరాలలో నాన్ ట్రైబల్స్ చాలామంది జమాల్ సాగు చేస్తున్నారని ఆయన అన్నారు. ఆదివాసి భూముల్లో కానీ ప్రభుత్వ భూముల్ల్లో ఎక్కడెక్కడ నాన్ ట్రైబల్స్ జామాయిల్ సాగు చేస్తున్నారో వాటిని ఆదివాసులే కొట్టుకొని ఆ లాభాన్ని పొందండి ఆయన ఈ సందర్భంగా ఆదివాసులకు పిలుపునిచ్చారు. 1/70 చట్టం అమల్లో ఉన్న ప్రాంతాల్లో గిరిజనయేతరులకు ఆదివాసి పట్టా భూముల్లో గాని ప్రభుత్వ భూముల్లో గాని ఏ రకమైన వ్యవసాయం చేసే హక్కు లేదని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాక అమాయక ఆదివాసులు అవసరాలను ఆసరిగా చేసుకొని ముందుగా డబ్బులు ఇచ్చి వాటికి చక్రవడ్డీ భూచక్ర వడ్డీలు వసూలు చేస్తున్న నాన్ ట్రైబల్ పై ఏజెన్సీ వడ్డీ వ్యాపార నిరోధక చట్టం కింద మరియు ఎస్సీ ఎస్టీ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.నా ట్రైబల్ భూములకు రక్షణ పోలవరం పరిహారం పొందిన నాన్ ట్రైబల్ భూముల్లో ఎవరు అక్రమాలకు పాల్పడవద్దని చింతూరు ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్ కం సబ్ కలెక్టర్ వారు జారీ చేసిన ఉత్తర్వులు ఆస్య స్పదంగా ఉందని ఏజెన్సీలోని ఆదివాసి ప్రజాప్రతినిధులు నాన్ ట్రైబల్ రక్షణ గురించే ఆవేదన చెందుతారు!, ఏజెన్సీలో ఆదివాసి చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిన ఐఏఎస్ అధికారులు కూడా చట్టానికి విరుద్ధంగా ఏజెన్సీలో చొరబడ్డ నాన్ ట్రైబల్ భూములు రక్షణ కోసమే ఆవేదన చెందుతారు!. అని ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. ఇక ఆదివాసి చట్టాల గురించి ఆదివాసి భూములు రక్షణ గురించి ఇంకెవరు మాట్లాడతారని ఆయన ప్రజాప్రతినిధులను అధికారులను ప్రశ్నించారు. 90 శాతం నాన్ ట్రైబల్స్ పోలవరం ప్యాకేజీ పొందిన భూములు అన్నీ కూడా ప్రభుత్వ ఆదివాసి భూములు అని వాటిని కబ్జా చేసి నాన్ ట్రైబల్ పేరుతోటి తప్పుడు పట్టాలు పొంది పరిహారం పొందారని ఆయన అన్నారు. ఏజెన్సీలో పని చేస్తూ ఏజెన్సీ చట్టాలు అమలు చేయాలని ఉత్తర్వులు ఇవ్వాల్సిన అధికారులు అది మరిచి నాన్ ట్రైబల్స్ ఆక్రమించుకున్న ఏజెన్సీభూములకు రక్షణ కల్పించడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ఏజెన్సీలో నాన్ ట్రైబల్ అక్రమ కట్టడాలన్నీ కూడా 1/70 చట్టం ప్రకారం తొలగించాలని ఉన్న, మరోపక్క గౌరవ న్యాయస్థానాలు అక్రమ కట్టడాలను తొలగించాలని భూ ఆక్రమణలు నిషేధించాలని ఆదేశాలు ఇస్తున్న అటువంటి వాటిని అమలు చేయని అధికారులు నాన్ ట్రైబల్ కబ్జాలో ఉన్న భూములకు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ఇదే చిత్తశుద్ధి ఆదివాసి చట్టాలు అమలు విషయంలో, ప్రభుత్వ ఆదివాసి భూములు నాన్ ట్రైబల్ స్ కబ్జా చేయకుండా చర్యలు తీసుకునే చిత్తశుద్ధి చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆదివాసి సర్పంచులు మోసం రాజులు, పండ కామేశ్వరరావు మరియు ఆదివాసీలు మోసం కన్నయ్య, కోర్స అన్నపూర్ణ, ఇర్ప సోమరాజు, నాగయ్య, రాజమ్మ, సున్నం నర్సింగరావు, సత్యమ్మ సీతారత్నం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments