ఆలమూరు భట్టీశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బండారు
వైభవంగా స్వామి వారి అన్నాభిషేకం
పయనించే సూర్యుడు, జనవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ :
కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం ఆలమూరులో అత్యంత పురాతనమైన, దక్షిణ భారతదేశంలో ఏకైక ఆలయంగా ప్రసిద్ధి చెందిన విక్రమభట్టీశ్వరస్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ధనుర్మాసం ఆరుద్ర దర్శనం సందర్భంగా నిర్వహిస్తున్న అన్నాభిషేకం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే బండారుకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కాళ్ళకూరి సూరిపండు, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు,తెదేపా మండల అధ్యక్షులు ఈదల సత్తిబాబు, ప్రముఖ పారిశ్రామికవేత్త వంటిపల్లి పాపారావులకు తెలుగుదేశం పార్టీ గ్రామ ప్రెసిడెంట్ ఈదల రాంబాబు. సొసైటీ ప్రెసిడెంట్ వంటిపల్లి సతీష్. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈదల నల్ల బాబు, మాజీ జెడ్పీటీసి రామానుజుల శేషగిరిరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కేతా రాంబాబు, వంటపాటి అర్జున, నెల్లి చిన్న, అనుసూరి గోవిందు, గుత్తుల కిరణ్ లు వేదాశీర్వచనం అందుకున్నారు. ఎమ్మెల్యే వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
