ఆశలకు 3 సంవత్సరాల లెప్రసీ సర్వే పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలి CITU డిమాండ్
కర్ని పిహెచ్ సి వైద్య అధికారి తిరుపతి కి వినతి పత్రం
గోవింద్ రాజ్ సిఐటియు జిల్లా అధ్యక్షులు
//పయనించే సూర్యుడు// //డిసెంబర్ 24 మక్తల్//
మక్తల్ మండలంలోని కర్ని పిహెచ్ సి ఆశల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు గోవిందరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆశలు నిరంతరం పనిచేస్తున్నారు. వీరి పట్ల ప్రభుత్వ అధికారులు సర్వేలు చేయించుకుంటూ మూడు సంవత్సరాల లెప్రసీ సర్వే పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆశలకు కనీస వేతనం ఫిక్స్డ్ వేతనం 18 వేలు ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్మిక వర్గం పెట్టుబడుదారులు, యజమానులకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధపడినప్పుడే తమ హక్కులను కాపాడుకోగలరని అన్నారు. ఆధునిక ప్రభుత్వాలు యాంత్రీకరణ పేరుతో కార్మికుల ఉపాధిని కొల్లగొట్టి, శ్రమ దోపిడిని కొనసాగించి, జీవన ప్రమాణాలను తగ్గిస్తున్నాయని విమర్శించారు. సంపద సృష్టికర్తలకు సంపదపై ఆధిపత్యం దా కే విధంగా సిఐటియు పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్ని PHC అధ్యక్షురాలు గోవిందమ్మ, కార్యదర్శి అమీనా బేగం, కోశాధికారి యశోద, ఉపాధ్యక్షురాలు అనిత ఇందిరమ్మ, సుజాత,భాగ్యమ్మ మహేశ్వరమ్మ, డి జయమ్మ, బి అనిత, సులోచనమ్మ, అనురాధ, లక్ష్మి, ఎం నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.
