ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా సులానగర్ పంచాయతీ బిఆర్ఎస్ అభ్యర్థి గుగులోతు లక్ష్మి నాయక్
పయనించే సూర్యుడు డిసెంబర్ 15 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి సులానగర్ గ్రామపంచాయతీ బిఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థిగా బ్యాట్ గుర్తుతో పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గుగులోతు లక్ష్మా నాయక్ సులానగర్ పంచాయతీ ఓటర్లను అభ్యర్థించారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తలు మరియు వార్డు మెంబర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ. తనకు కేటాయించిన ‘బ్యాట్ ‘గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. సోమవారం గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. గ్రామంలోని సమస్యలన్నిటిని, పరిష్కరిస్తానని,2006 సులానగర్ ఉమ్మడి గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ టిడిపి మద్దతుతో రాజకీయాల కతీతంగా గ్రామపంచాయతీ ఓటర్లు అందరి సహకారంతో ఆనాడు గ్రామ సర్పంచ్ గా గెలిపించారన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను వారందరి దృష్టికి తీసుకువెళ్లి సమన్వయంతో అభివృద్ధిక చేస్తా అన్నారు.ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే మీ అందరి సహకారంతో గ్రామంలోని పొలాలకు వెళ్లే రహదారులు, అంతర్గత రహదారు లకు సైడ్ డ్రైనేజీలు, ముత్యాలమ్మ గుడి వరకు రహదారి ఏర్పాటు, బొడ్రాయి స్థలంలో చుట్టూ ఫ్లోరింగ్ చేయించి సుందరంగా తీర్చిదిద్దుతానని, ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ ప్రహరీని నిర్మిస్తానని, మిషన్ త్రాగునీరుని ఇంటికి ప్రతి ప్రతిరోజు సరఫరా సక్రమంగా అయ్యే విధంగా చూస్తానన్నారు. వీధిలైట్లు, స్థానికంగా ఉన్న సమస్యలను, కోతుల బెడదను, కుక్కల బెడదను ప్రజలతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తన జీవితంలో చివరి అవకాశం గా గ్రామ అభివృద్ధికి తోడ్పడి మంచి పేరుతో చిరకాలం గా నిలవాలని ఆశయంతో మిమ్ములను అభ్యర్థిస్తు న్నానని, ప్రతి ఒక్కరూ ఆలోచించి తన బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల ని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నారు.ఓట్లు అభ్యర్థిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తున్నారని అన్నారు. నేను గెలిస్తే, అది ప్రజల గెలుపుగా భావిస్తానని, అందరికీ సేవచేస్తూరుణంతీర్చుకుంటానన్నారు.ఈ కార్యక్రమంలో, ఉండేటి బసవయ్య, తోడేటి యాకోబు, కుమ్మరి కిరణ్ కుమార్,బల్లెం బిక్షం, కే లోతు రామ్ కుమార్,కుమ్మరి చౌదరి, బల్లెం సురేష్, ఉండేటి ఆగయ్య, బానోతులక్పతి, తదితరులు పాల్గొన్నారు.ఎండ్ న్యూస్