ఇంటర్నేషనల్ వేదిక్ మాథ్స్ ఛాంపియన్ గా విజన్ విద్యార్థి వర్షితా భాయ్
పయనించే సూర్యుడు జనవరి 16 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
జాతీయ గణిత దినోత్సవం – 2025 సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన అంతర్జాతీయ వేదిక్ మాథ్స్ లెవెల్ వన్ పోటీలలో యాడికి పట్టణానికి చెందిన విజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థి మరాఠీ వర్షిత భాయ్ అత్యంత తక్కువ సమయంలో తనకిచ్చిన గణిత సమస్యలను కేవలం 3నిముషాల.4 సెకండ్లలో 75 ప్రశ్నలకు సమాధానాలు పూర్తిచేసి ఇంటర్నేషనల్ వేదిక్ మాథ్స్ ఛాంపియన్ గా నిలబడడం జరిగింది.. అలాగే అదే లెవెల్లో విజన్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు దాసరి హేమశ్రీ, బిందు శ్రీ,చింత మోక్షిత్ బ్యాచ్ నెంబర్ 1,2,3 స్థానాలను కైవసం చేసుకుని దేశవ్యాప్తంగా యాడికి పట్టణానికి చెందిన విజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పేరు ను నిలబెట్టడం జరిగింది.. జాతీయ గణత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో వీరికి బహుమతులను ప్రకటించడం అవి కొరియర్ ద్వారా స్కూల్ కి పంపించడం జరిగింది.. వాటిని సంక్రాంతి పండుగ సందర్భంగా విజన్ విద్యాసంస్థల కరస్పాండెంట్ విశ్వనాథ్ చేతుల మీదుగా విద్యార్థులకు వారి తల్లి దండ్రుల సమక్షంలో అందించడం జరిగింది. వీరిని తీర్చిదిద్దిన మ్యాథమెటిక్స్ టీచర్ అనిల్ ని మరియు విద్యార్థులని కరెస్పాండెంట్ విశ్వనాథ్ అభినందించడం జరిగింది…

