PS Telugu News
Epaper

ఇంటర్ గిరిజన గురుకుల సి.ఓ.ఈ కళాశాలల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

📅 24 Mar 2026 ⏱️ 7:32 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించె సూర్యుడు మార్చి 24(పొనకంటి ఉపేందర్ రావు )

భద్రాది కొత్తగూడెం :తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో (2026-27)విద్యా సంవత్సరంకు గానుఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సి.ఓ.ఈ కళాశాలలో ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైనట్లు భద్రాచలం గిరిజన గురుకుల కళాశాల సిఓఈ (బాలికల) ప్రిన్సిపాల్ శ్రీమతి ఏ.పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ,బైపీసీ గ్రూపుల్లో ప్రవేశాల కోసం రాష్ట్రంలోని గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో ఉన్న సిఓఈ కాలేజీలో ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19వ తేదీన జరగనున్నట్లు వెల్లడించారు. సిఓఈలో ప్రవేశాల కోసం మార్చి 12 నుంచి ఏప్రిల్ 7 వరకు tgtwreis. telangana. gov. in సైట్ లో దరఖాస్తుచేసుకోవాలనిసూచించారు. ఈ విద్యా సంవత్సరం 10 వ తరగతి చదివిన భద్రాద్రి కొత్తగూడెం,ఖమ్మం జిల్లాల గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు

Scroll to Top