ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను దగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వo
{పయనించే సూర్యుడు} {అక్టోబర్28} మక్తల్
అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి మోసగించిన ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు ఐదు లక్షల రూపాయలు సాయం చేస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న ఒక ప్రకటన చేయడం జరిగింది .అదేమిటంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) లో 60 వేల రూపాయలు మరుగుదొడ్డి మరియు గృహ నిర్మాణంలో పనిచేసే కూలీల పని దినాలకు కూలి వర్తింపచేసి వారికి ఇస్తామన్న అయిదు లక్షల రూపాయలను 60 వేల రూపాయలు తగ్గించి నాలుగు లక్షల 40 వేల రూపాయలు మాత్రమే ఇస్తామని మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని భారతీయ జనతా పార్టీ నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి గారు ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలలో నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున రాష్ట్రం లో మొత్తం 20 లక్షల గృహాలను నిర్మిస్తామని చెప్పి వచ్చే నెలాఖరుతో రెండు సంవత్సరాల పూర్తి చేసుకుంటున్న ఈ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 కూడా పూర్తి చేయలేకపోయింది ఇంకా మూడు సంవత్సరాలలో 20 లక్షల గృహాలను నిర్మించి ఇస్తారన్న నమ్మకం ప్రజలకు లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో మహాలక్ష్మి పథకం 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు 2000 నుంచి 4000 రూపాయలు ,వికలాంగుల పెన్షన్3000 నుండి 6000రూపాయలకు, కాలేజీ స్టూడెంట్ కి స్కూటీ లు , నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ,దళిత బంధు 12 లక్షల రూపాయలు, బీసీ బందు, రైతు బంధు ఈ విధంగా ఎన్నో అలవి కానీ హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ వాటిని తుంగలో తొక్కి ప్రజలను వంచిస్తూ పాలన కొన సాగిస్తున్నారని అన్నారు. మూలిగే నక్క పై తాటికాయ పడ్డట్టుగా వ్యయప్రయాసలకు ఓర్చి లబ్ధిదారులు ఇళ్ళ నిర్మాణం చేపడుతుంటే మధ్యలో ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయించడం శోచనీయమని అన్నారు.
ఆరుగారింటిలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.
జి బలరాం రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి భారతీయ జనతా పార్టీ నారాయణపేట జిల్లా.