ఇందిరామహిళా చీరలు కాదు మాకు కావాల్సింది నర్వ మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల
{పయనించే సూర్యుడు} {నవంబర్26 నర్వ }
SFI జిల్లా ఉపాధ్యక్షులు కేయం.మహేందర్ ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసినట్టుగానే నర్వ మండలానికి కూడా ప్రభుత్వ జనరల్ కళాశాల కావాలి పదవ తరగతి కంప్లీట్ అయిన విద్యార్థులు ఇంటర్మీడియట్విద్యకు దూరమై చాలా దూరం పోయి చదవలేక విద్యకు దూరమైనటువంటి ప్రాంతం ఈ నడిగడ్డ ప్రాంతం నర్వ కాబట్టి బస్సు సౌకర్యాలు సరిగ్గా లేవు రవాణ రోడ్డు సౌకర్యాలు లేవూ రావు ఇరకాటంగా బస్ లు అవీ సమయానికి రానే రావు కానీ నర్వలోనే జూనియర్ కళాశాల ఏర్పడితే కాళ్లనడక నడిచైనా సరే మేము (మండల పరిధిలోని అన్ని గ్రామాల విద్యార్థులు) చదువుకుంటాం మాకు మండలంలోనే కావాలని చెప్పేసి చాలామంది విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు కాబట్టి నర్వ మండలానికి ఖచ్చితంగా ప్రభుత్వ జూనియర్ జనరల్ కళాశాల కావాలి. ఎలక్షన్ లో గెలిచిన వెంబడే ఏర్పాటు చేస్తానని జాన్ ర గుట్ట పాతర్ చెడ్ కు వెళ్ళే దారిలో గుట్ట తవ్వారు కానీ పునాది కూడా వెయ్యలేదు ఎందుకో తెలియదు కానీ తెలవాల్సిందల్లా ఎప్పుడూ ఎప్పుటి లోపల జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తారో ఖచ్చితంగా జవాబుదారిగా డుల్లా కేసిఆర్ ప్రభుత్వం లా కేజీ to PG అంటూ పదేళ్లు మోసం చేశారు మీరూ మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా 5, 10 ఏలుదామని ఇచ్చిన హామీలు అమలు చెయ్యకుండా నిర్లక్ష్యం చేస్తే నర్వ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు విధ్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు వివిధ రాజకీయ పార్టీల నేతలూ తిరగబడే రోజు వస్తుందని ఈ ఎలక్షన్స్ కన్నా ముందే ముక్కు సూటిగా చెబుతున్నాం సమాధానం ఇవ్వాలనీ, 2023 సంవత్సరంలో ఓట్లు వేయించుకొని గెలిచిన మక్తల్ శాసన సభ్యులు & పశుసంవర్ధక,డైరీ మత్స్య ,పాడి పరిశ్రమ, క్రీడా & యువజన సర్వీస్ ల శాఖ రాష్ట్రమంత్రి వర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి విద్యా వైద్య రవాణ రోడ్డు సౌకర్యాల పరంగా వెనుకబడిన ప్రజల అందరికీ స్పందించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో sfi నాయకులు నవీన్ కుమార్ యాదవ్, నరేందర్ , స్వాతి తదితరులు పాల్గొన్నారు
