
పయనించే సూర్యడు // మార్చ్ // 29 // కుమార్ యాదవ్ // ( హుజురాబాద్)..
రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీక అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వోడితల ప్రణవ్అన్నారు. శుక్రవారం రోజున జమ్మికుంట
పట్టణ పరిధిలోని కొత్తపల్లిలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న-కోఠి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ..హుజూరాబాద్ నియోజకవర్గ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.నెల రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారని ఇది మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు.అనంతరం కొన్ని సమస్యలు ప్రణవ్ దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
