ఇలేగాo గ్రామంలోని స్వామి వివేకానంద జయంతి 163వ , జాతీయ యువజన దినోత్సవ వేడుకలు
ఈ సందర్భంగా కసరోల్ల ప్రవీణ్ మాట్లాడుతూ ముందుగా యువతకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామి వివేకానంద ఆదర్శాలను అలవర్చుకుని, సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతూ ఉత్తమ సమాజ నిర్మాణానికి ప్రతి యువకుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు.యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, సేవాభావం పెంపొందించడంలో స్వామి వివేకానంద గారి బోధనలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని కాసర్ల ప్రవీణ్ అన్నారు. దేశ భవిష్యత్తును నిర్మించే యువతకు ఆయన ఆలోచనలు నిరంతర ప్రేరణగా ఉంటాయని పేర్కొంటూ, స్వామి వివేకానంద గారి జీవితం, వారి సందేశాలు నేటి సమాజానికి అత్యంత అవసరమని తెలిపారు.స్వామి వివేకానంద గారి ఉన్నత ఆలోచనలను కేవలం స్మరించడమే కాకుండా, వాటిని మన దైనందిన జీవితాల్లో ఆచరణలో పెట్టినప్పుడే వారికి మనం అర్పించే నిజమైన నివాళి అవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భైంసా పట్టణ బీజేపీ నాయకులు కాసరోల్ల ప్రవీణ్, మరియు కార్యకర్తలు బీమా శంకర్, చొప్పరి వెంకటేష్ , హనుమాన్లు సుభాష్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.