ఈ దౌర్జన్య పార్కింగ్ని ని అరికట్టేది ఎవరో గురుకుల విద్యార్థుల భవిష్యత్తు .
పయనించే సూర్యుడు డిసెంబర్ 15 సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఎదురుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అడ్డగోలుగా పార్కింగ్ చేసి గురుకులం దగ్గర ఏం జరుగుతుందో ఎవరికి కనిపించదు గురుకులం చుట్టూ పార్కింగ్ చేసి ఎవరైనా గోడ దిగి లోపలికి వెళితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఆడపిల్లలు ఉండే గురుకులం దగ్గర ఏమైనా జరగొచ్చు ఆడపిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడాలి కదా అదే పెత్తందారుల స్కూలు దగ్గర కాలేజీ దగ్గర ఇలాంటి పార్కింగ్ చేస్తారా పేదల చదివే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మెయిన్ గేట్ కి అడ్డంగా అడ్డుగోలుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిలుపుతున్నారు
వివరాలకు వెళ్తే సూళ్లూరుపేట గురుకుల పాఠశాలలో దాదాపు 1500 మంది పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతున్నారు అయినా కానీ ప్రతిరోజు నిత్యం పిల్లల కోసం వచ్చే పేరెంట్స్ తమ పిల్లల్ని చూడలేకుండా ఈ బస్సులు వల్ల చాలా అడ్డంకులుగా ఉన్నాయని పిల్లలు తల్లిదండ్రులు వాపోతున్నారు కానీ ఎన్నిసార్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బస్సుల యొక్క యాజమాన్యాన్ని మరియు పోలీసు వారిని ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసిన చేసినా ఫలితం లేకుండా పోతుంది అయినా దీనివల్ల ఈ బస్సులు పార్కింగ్ వల్ల పిల్లలకి తల్లిదండ్రులకి రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉందని సూళ్లూరుపేట పట్టణ ప్రజలు మరియు పిల్లల తల్లిదండ్రులు మరియు మర్యాదపూర్వకంగా ఉన్నత అధికారులు ఈ విషయాన్ని గమనించి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు