ఈ నెల 6 న బాసర కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
100 కోట్ల తో బాసర ఆలయ పునర్నిర్మణానికి శంఖుస్థాపన
200 కోట్ల తో ఇంటిగ్రెటెడ్ స్కూల్ కు భూమి పూజ
ఈనెల 6 న ఉదయం 11 గంటలకు బాసరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలియజేశారు. బాసర లో మాస్టర్ ప్లాన్ అమలు చేయడంతో పాటు ఆలయ ఆలయపున నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలియజేశారు. అదేవిధంగా ముధోల్ లో 200 కోట్ల తో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని బాసరలోనే చేపడతారని చెప్పారు. గత ప్రభుత్వ హాయంలో నిధులు మంజూరై అప్పటి పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఆలయ పునర్నిర్మాణానికి నోచుకోలేదని ఎమ్మెల్యే అన్నారు. పలుమార్లు ఈ విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడడం, ముఖ్యమంత్రికి విన్నవించడం జరిగిందని, బాసరకు ముఖ్యమంత్రి రావడం శుభ పరిణామన్నారు. బాసర ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు.