PS Telugu News
Epaper

ఉగాది సందర్భంగా చందన అలంకారంతో చెంగాలమ్మ తల్లి దర్శనం

📅 18 Mar 2026 ⏱️ 7:13 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 18 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో కాలింగ్ నది ఒడ్డున వెలిసి ఉన్న అమ్మలగన్న అమ్మ శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి తల్లి స్వస్తి శ్రీ పరభావ నామ సంవత్సరము ఉగాది సందర్భంగా అమ్మలగన్న అమ్మ శ్రీ చంగాలమ్మ తల్లి దేవస్థానం నందు రేపు అనగా మార్చి 19వ తారీఖున ఉగాదిని పురస్కరించుకొని చందన అలంకారంతో భక్తులకు స్వర్ణ కిరీటం విశ్వరూప దర్శనము మరియు లక్ష కుంకుమ అర్చన జరుగును కావున సూళ్లూరుపేట పట్టణం నందు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అమ్మవారి దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి చెంగాలమ్మ తల్లి కృపాకటాక్షములకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నారు సహాయ కమిషనర్ కార్యనిర్వదాధికారి

Scroll to Top