PS Telugu News
Epaper

ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రులు దామోదర రాజనర్సింహ,వాకిటి శ్రీహరి

📅 17 Oct 2025 ⏱️ 6:53 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

మక్తల్ నియోజకవర్గంలోని సంగంబండ రిజర్వాయర్ లో చేపపిల్లలు విడుదల

కార్యక్రమంలో లో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణీ

( పయనించే సూర్యుడు అక్టోబర్ 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతంగా చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీకి ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. నేడు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, క్రీడలు, యువజన సేవల మంత్రి వాకిటి శ్రీహరి తన నియోజకవర్గంలోని సంగంబండ రిజర్వాయర్, మక్తల్ పెద్ద చెరువులో చేప పిల్లలను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 % రాయితీ తో ఈ పథకాన్ని అమలు చేస్తుంది.ఈ పథకం వల్ల రాష్ట్రంలో ప్రత్యక్షంగా 5 లక్షల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు, పరోక్షంగా మరో నాలుగు లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం 122.22 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి,నారాయణ పేట్ ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి,మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top