PS Telugu News
Epaper

ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి బహుమతులు అందజేత

📅 05 Mar 2026 ⏱️ 6:53 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే సూర్యుడు మార్చి 5 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

ఇటీవల అమలాపురం కిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, సాపేవారిపల్లి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచి జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారు. వీరికి కిమ్స్ యాజమాన్యం వారు స్వయంగా పాఠశాలకు విచ్చేసి నగదు ప్రోత్సాహకంతో పాటు ప్రతిభా ప్రశంసా పత్రాలను అందజేశారు. జూనియర్ విభాగంలో వ్యాసరచన పోటీలో కాశి ఆశ్రీత,వక్తృత్వంలో పలివెల మహాలక్ష్మి, అదేవిధంగా సీనియర్ విభాగంలో వక్తృత్వం పోటీలలో గనిశెట్టి కీర్తి స్వరూప లక్ష్మి బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల మొదటి సహోపాధ్యాయులు ఎన్.ఎస్. సత్యనారాయణ మాట్లాడుతూ ఇటువంటి పోటీలలో పాల్గొనే విధంగా చేసినటువంటి కిమ్స్ యాజమాన్యానికి మరియు విద్యార్థుల గైడ్ టీచర్ కొల్లి బేబీ మరియు బి.దుర్గాభవానిలకు కృతజ్ఞతలు తెలియజేశారు . జిల్లా స్థాయి పోటీలలో పాల్గొని పాఠశాలకు మరియు గ్రామానికి పేరు తీసుకు వచ్చిన విద్యార్థులందరినీ అభినందించారు. అదేవిధంగా పాఠశాల నుండి మరొక ఐదుగురు కూడా పాల్గొని ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ సిబ్బంది బాలనాగు, బాబి, ఉపాధ్యాయులు గెడ్డం ప్రదీప్, ఎం. శ్రీనివాసరాజు, వై.కృష్ణ, చెల్లి దీపిక, సిహెచ్ జ్యోతి, ఎం. సౌమ్య సుజని విద్యార్థులు పాల్గొన్నారు.

Scroll to Top