ఉద్యోగుల సమ్మె తో మూత పడనున్న సొసైటీలు
పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 16 ముమ్మిడివరం ప్రతినిధి :
నేటి నుండి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు రాష్ట్రలో గల 2060 పిఏసియస్ ల ఉద్యోగులు నిరవధిక సమ్మెకు వెళు న్నట్లు ఎపి. పిఏసియస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి పెంకే సత్యనారాయణ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షులు యర్రంశెట్టి రామచంద్రరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఏసియస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి పెంకే సత్యనారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జి.ఓ 36 అమలు పర్చాలని, 2019, 2024 పిఆర్ సి ఇవ్వాలి లేని పక్షం లో 50 శాతం తగ్గకుండా మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2 లక్షలు గ్రాడ్యూటీ సీలింగ్ ఎత్తివేసి ఎక్ట్ ప్రకారం గ్రాడ్యూటీ చెల్లించాలి. 2019 తరువాత జాయిన్ అయిన ఉద్యోగులను రెగ్యులర్చేయాలన్నారు. పదవీ విరమణ వయస్సు 60 నుండి 62 కు పెంచాలని, సంఘాలు లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని స్వత్యనారాయణ డిమాండ్ చేశారు. 5లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్, 20 లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని లేకపోతే సమ్మె తో పాటు ఉద్యమం ఇంకా ఉదృతం చేస్తామని పెంకే సత్యనారాయణ హెచ్చరించారు.గత 18 నెలలుగా ఎన్నోసార్లు కోరినప్పటికి మాట ఇచ్చి సమస్యలు తీర్చనందున రాష్ట్ర జెఏసి నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2060 ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘముల ఉద్యోగులు 9 వేల మంది తో విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చినప్పటికి ప్రభుత్వం స్పందించక పోవడంతో రాష్ట్రం లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కి మా సమస్యలు తీర్చమని డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు అందించామని సత్యనారాయణ తెలిపారు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులందరికి సమ్మె నోటీసులు ఇచ్చి సమ్మె లోకి వెళ్లడం జరుగుతుందన్నారు. సోమవారం నుండి సహకార సంఘ కార్యకలాపములు నిలిచిపోనున్నాయని తెలిపారు. దీనివలన వ్యవసాయ అవసరాల కొరకు భూములపై రుణాలు పెట్టుకున్న రైతాంగానికి రుణాలు నిలిచిపోతాయని అన్నారు. సకాలంలో చెల్లించవల్సిన వడ్డీలకు అపరాద వడ్డీలు చెల్లించాల్సి వస్తుందని అన్నారు. అదే విదంగా సంఘాల నుండి సబ్సిడీ పై విక్రయిస్తున్న ఎరువులు విత్తనాలు, పురుగు మందులు విక్రయాలు నిలిచిపోతాయని సత్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి బొబ్బా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
