ఉద్యోగ విరమణ సన్మానోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
( పయనించే సూర్యుడు మార్చి 10 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
షాద్ నగర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శ్రీమతి ఎల్గనమోని పద్మావతి గారి ఉద్యోగ విరమణ సందర్భంగా నిర్వహించిన సన్మానోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి, ఎన్నో సంవత్సరాల పాటు చేసిన సేవలను ప్రశంసించారు. పద్మావతి గారు భవిష్యత్తులో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
