ఉపాధ్యాయులది విద్యార్థులది గొప్పఅవినావభావ మంత్రి ఆనం
పయనించే సూర్యుడు డిసెంబర్ 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
బెత్తం దెబ్బలు తీపి గుర్తులుగా మిగిలిపోవాలి దెబ్బలు తిన్న చేతులే. నేడు జాతీయస్థాయిలో సంతకాలు చేస్తున్నాయి ఆనాటి విద్యార్థుల గురుభక్తిని నేటి విద్యార్థులతో పంచుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉపాధ్యాయులది, విద్యార్థులది గొప్ప అవినావభావ అనుబంధం మంత్రి ఆనం ఆనాటి గురువుల బెత్తం దెబ్బలు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని, దెబ్బలు తిన్న అరచేతులే నేడు ఉన్నత స్థానాల్లో సంతకాలు చేస్తున్నాయని ఆనాటి సంగతులను, గురువుల గొప్పతనాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేటి తరం విద్యార్థులకు వివరించే ప్రయత్నం చేశారు. మండల కేంద్రమైన చేజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా నిలిచింది. పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రులు, ఆత్మీయ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోషల్ మీడియాలో ఒక వచ్చిన వీడియోను విద్యార్థులకు విద్యార్థులకు చూపించారు. ఆ వీడియోలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత రంగాల్లో మంచి గుర్తింపు పొందిన వారందరూ, తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయురాలి వద్దకు వచ్చి, ఆమెతో వారి అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం, తాము ఆనాడు తిన్న బెత్తం దెబ్బలను అరచేతులను చూపించి మళ్లీ కొట్టమని అడగడం వంటి మధురమైన దృశ్యాలను విద్యార్థులకు మంత్రి చూపించి, బెత్తం దెబ్బల మాధుర్యాన్ని, గురువులకు, విద్యార్థులకు ఉన్న అవినావభావ అనుబంధాన్ని నేటితరం విద్యార్థులకు వివరించారు, నేటితరం విద్యార్థులందరూ గురువులను, తల్లిదండ్రులను గౌరవిస్తూ సత్ప్రవర్తనతో ముందుకు సాగితే విజయాలను అందిపుచ్చుకోవచ్చని, మంచి పౌరులుగా రాణించి సమాజానికి, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా మంత్రి ఆనం విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. సోషల్ మీడియా వీడియోను మంత్రి ఆనం విద్యార్థులకు వివరించిన తీరు ప్రతి ఒకరిని ఆలోచింపజేసింది. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాళ్లూరు గిరినాయుడు. టిడిపి మండల కన్వీనర్ షేక్ సిరాజురుద్దీన్. ఎంపీపీ తూమాటి. విజయభాస్కర్ రెడ్డి. కొమ్మి. సిద్ధుల నాయుడు. సొసైటీ అధ్యక్షులు బి. వీర రాఘవరెడ్డి. రావి .పెంచల రెడ్డి. సోమవరపు హజరత్తయ్య. సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ ఏలూరు. కేశవ చౌదరి. మోదేపల్లి పెంచలనాయుడు. 24 ఎల్ సోమశిల కాలువ చైర్మన్ ఉడత. హజరత్తయ్య. టిడిపి మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు అధికారులు ప్రజాప్రతినిధులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
