PS Telugu News
Epaper

ఉప ఖజానా కార్యాలయంలో ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్ ఆర్ లక్ష్మణ్ నాయక్.

📅 22 Dec 2025 ⏱️ 5:12 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు డిసెంబర్ 22,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

డోన్ పట్టణంలోని ఉప ఖజానా కార్యాలయంను ఏసిబి అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. డోన్ మున్సిపల్ కార్యాలయంలో రెవిన్యూ అధికారి గా శ్యామ్ రాజు 30/06/2025 రిటైర్డ్ అయ్యారు. పెన్షన్ మంజూరు అయ్యింది కానీ పెన్షన్ బెనిఫిట్స్ కోసం గత ఐదు నెలల నుండి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ ఉండటంతో సీనియర్ అసిస్టెంట్ ఆర్ లక్ష్మణ్ నాయక్ 45000 రూపాయలు డిమాండ్ చేయగా 30,000 రూపాయలు ఇస్తానని ఒప్పుకున్నాడు. శ్యామ్ రాజు ఫిర్యాది దారుడు మేరకు ఏసీబీ డిఎస్పి సోమన్న దాడులు చేపట్టారు. డోన్ ఉప ఖజానా కార్యాలయము నందు పనిచేస్తున్నటువంటి సీనియర్ అసిస్టెంట్ ఆర్ లక్ష్మణ్ నాయక్ 30,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడని తెలియజేశారు.. ఈ సోదాలలో డిఎస్పి ఏసిపి సోమన్న, సీఐ లు కృష్ణయ్య, రాజ ప్రభాకర్, శ్రీనివాసులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top