PS Telugu News
Epaper

ఉమా ఎడ్యుకేషనల్ సొసైటీలో ఘనంగా “ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం”

📅 21 Mar 2026 ⏱️ 6:33 PM 📝 తెలంగాణ
Listen to this article

రూ. 2.50 లక్షల విలువైన సహాయ పరికరాల పంపిణీ

పయనించే సూర్యుడు మార్చి 20 ముమ్మిడివరం ప్రతినిధి కాకినాడ (వాకలపూడి): స్థానిక వాకలపూడి పంచాయతీలోని ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ కార్యాలయంలో ఈ రోజు “ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం” వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముంబైకి చెందిన “ఎమ్. పల్లోంజి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రైవేట్ లిమిటెడ్” వారి ఆర్థిక సహకారంతో, సుమారు రూ. 2,50,000 (రెండు లక్షల యాభై వేల రూపాయల) విలువైన కృత్రిమ పరికరాలను దివ్యాంగులకు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సంస్థ కార్యనిర్వాహక వర్గ సభ్యులు (Board of Directors) శ్రీ ఎస్.పి. రెడ్డి (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్), శ్రీ పి. కనకరాజు గారు , డాక్టర్ డి. విజయలక్ష్మి గారు , శ్రీ ఎన్. వెంకటేశ్వర్లు గారు , శ్రీ కె. సత్యనారాయణ గారు , మరియు శ్రీమతి ఎస్. మహాలక్ష్మి గారు పాల్గొని పంపిణీని ప్రారంభించారు.ఈ సందర్భంగా బోర్డు సభ్యులు మాట్లాడుతూ.. డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల పట్ల సమాజం సానుకూల దృక్పథంతో ఉండాలని, వారికి సరైన శిక్షణ, ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సాధిస్తారని పేర్కొన్నారు. ఎమ్. పల్లోంజి గ్రూప్ వారి తోడ్పాటుతో సుమారు 60 మంది లబ్ధిదారులకు మూడు చక్రాల సైకిళ్లు, కృత్రిమ కాళ్లు, కాలిపర్స్, వీల్ చైర్లు, కళ్లజోళ్లు మరియు వినికిడి యంత్రాలను అందజేయడం సంతోషంగా ఉందన్నారు.అనంతరం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఎస్.పి. రెడ్డి మాట్లాడుతూ.. సంస్థ కార్యనిర్వాహక సభ్యుల సమష్టి కృషి మరియు దాతల సహకారం వల్లే ఇంతటి భారీ వ్యయంతో కూడిన పరికరాలను ఉచితంగా అందించగలుగుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులందరికీ ఆయన తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ కె. నారాయణ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ శ్రీ ఎస్.వి.ఎస్.ఎన్. రెడ్డి, శ్రీమతి ఎస్. ఉమారెడ్డి, జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం సిబ్బంది, ప్రత్యేక విద్యా శిక్షకులు, ట్రైనీ విద్యార్థులు, లబ్ధిదారులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(ఎస్.పి. రెడ్డి)ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

Scroll to Top