ఎన్నికల సమయంలో కాదు… ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే నాయకుడు కావాలి. : భూతరాజు దశరథ, మున్సిపల్ వైస్ చైర్మన్.
పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 26
.చండూర్ పట్టణం 8వ వార్డు కౌన్సిలర్‌గా ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధించి, మున్సిపల్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన భూతరాజు దశరథ గారు పదవిలోకి వచ్చిన వెంటనే గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడం విశేషంగా నిలిచింది.తాగునీరు, డ్రైనేజీ, అంతర్గత రోడ్లు, వీధి దీపాలు, రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు వంటి సమస్యలతో పాటు కాంగ్రెస్ పార్టీ పథకాలు అర్హులకు అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రజలు వివరించిన సమస్యలపై వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు.“ఎన్నికలప్పుడు మాత్రమే కాదు… ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే నాయకుడు కావాలి. దశరథ గారు అదే నిరూపిస్తున్నారు” అని వార్డు మహిళలు, ప్రజలు పేర్కొన్నారు.“మాటలు కాదు… పని చేయడం ముఖ్యం. మా వార్డుకు అలాంటి నాయకుడు దొరికాడు” అని యువత అభిప్రాయపడ్డారు.ప్రజా క్షేమమే అసలైన రాజకీయమని నమ్ముతూ ముందుకు సాగుతున్న ఈ నాయకత్వానికి ప్రజలు మద్దతు ప్రకటించారు. రాబోయే రోజుల్లో వార్డు అభివృద్ధి పనులు మరింత వేగవంతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో పన్నాల లింగయ్య, బోడ వెంకటేశం, సంగేపు సురేష్, బుచ్చాల లింగయ్య, సంగేపు శ్రీను, బొమ్మకంటి లింగయ్య, మున్సిపల్ వాటర్ సిబ్బంది ఏకాలపు రామచంద్రం, బోద రాము, గండూరి సురేష్, ఎలక్ట్రికల్ సిబ్బంది ఎర్రజెల్ల నర్సింహ్మ మరియు పలువురు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
