ఎన్నికల హామీల అమల వైఫల్యాలను నిరసిస్తూ మంగళవారం రోజు న భీంగల్ తహసిల్దార్ కి వినతి పత్రం
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మండలం లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మరియు జిల్లా శాఖ మరియు బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మరియు ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ ఈరోజు మంగళవారం రోజున భీంగల్ తహసీల్దార్ కార్యాలయం ముందర నిరసన వ్యక్తం చేస్తూ ఇంచార్జి తహసీల్దార్ శ్రీనివాస్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది,
ఈ సందర్భంగా భీంగల్ మండల అధ్యక్షుడు ఆరె రవీందర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందర మోసపూరితమైన 420 హామీలు ఇచ్చి గద్దినెక్కిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరుచుకొని వెంటనే పెంచుతానన్న అన్ని రకాల పెన్షన్లను పెంచలని, అర్హులైన యువకులకు నిరుద్యోగ భృతి కల్పించాలని,రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని, రెండు లక్షల రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, చదువుకుంటున్న విద్యార్థినిలకు ఇస్తానన్న స్కూటీలు ఇవ్వాలని, కల్యాణలక్ష్మి పథకంలో ఇస్తానన్న తులం బంగారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కుప్కల్ గ్రామ సర్పంచ్ నర్సింగరావు, పురానిపేట ఉప సర్పంచ్ తోట హరికృష్ణ, కిసాన్ మోర్చా అధ్యక్షుడు తోట గంగాధర్, మండల ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ,ఉపాధ్యక్షులు ఈర్ల మహేందర్,కార్యదర్శి రజనీకాంత్,బీజేవైఎం మండల అధ్యక్షులు శెట్టి ప్రేమ్చంద్,సీనియర్ నాయకులు కొట్టాల అశోక్, ధర్పల్లి మహిపాల్,దినేష్,హరిప్రసాద్,తోట రమేష్, చెప్పాల సునీల్,సుదర్శన్,హర్షవర్ధన్, నవీన్, భాగ్యరాజ్, ఆదిత్య బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
