PS Telugu News
Epaper

ఎమ్మెల్యే ఆయితాబత్తుల ఆనందరావుకు ‘శాప్ లీగ్స్’ ఆహ్వానం

📅 12 Mar 2026 ⏱️ 7:16 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 12 అమలాపురం

​డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న “శాప్ లీగ్స్ – బ్యాడ్మింటన్ మాస్టర్స్ స్టేట్ లెవల్ ఛాంపియన్‌షిప్ – 2026” ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు ని నిర్వాహకులు కోరారు.
​గురువారం ఎమ్మెల్యే నివాసంలో ఆయనను మర్యాద పూర్వకముగా కలిసిన ప్రతినిధులు, ఈ క్రీడా పోటీలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. స్థానిక జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (DSA) ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి.​సుమారు 200మంది జెంట్స్ షటిల్ బాడ్మింటన్ క్రీడాకారులు, 50 మంది మహిళా క్రీడాకారులు వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రానున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి (DSDO) వి.ఆర్. రుద్ర, బాలయోగి స్టేడియం షటిల్ క్రీడాకారుడు మండేల బాబీ, స్టేడియం కోచ్ భీమేష్ ఇతర క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు.​క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా అమలాపురం బాలయోగి స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ మెగా టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడాకారులను ఉత్సాహపరచాలని ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేను కోరారు.

Scroll to Top