ఎమ్మెల్యే ను కలిసిన బూర్గుల వార్డ్ సభ్యులు
గ్రామ అభివృద్ధికి తోడ్పాడాలంటూ విన్నపం..
మర్యాద పూర్వకంగా కలిసిన వార్డ్ సభ్యులను ఘనంగా సన్మానిస్తూ అండగా ఉంటనని ఎమ్మెల్యే వీర్లపల్లి భరోసా..
( పయనించే సూర్యుడు డిసెంబర్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
పల్లెపోరులో వార్డు సభ్యులుగా తమ అదృష్టన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు గ్రామస్థుల ఆశీర్వాదంతో విజయం సాధించారు.ఎన్నికల వేళా గ్రామస్థులకు ఇచ్చిన హామీల్లో భాగంగా అధికార పార్టీతోనే అభివృద్ధి పరుగులు పెడుతుందని సంక్షేమ ఫలాలు అందించేందుకు తోడ్పాటు దక్కుతుందనే విశ్వాసంతోనే స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు బూర్గుల వార్డ్ సభ్యులు..ఇదే క్రమంలో వార్డ్ సభ్యులను కలుసుకున్న ఎమ్మెల్యే ఎన్నికల కురుక్షేత్రంలో విజయం సాధించిన వార్డ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికైన ప్రజా ప్రతినిధులుగా ఏంతో బాధ్యతయుతంగా మసులుకోవాలని గ్రామస్థులు కట్టబెట్టిన పదవికి వన్నె తెచ్చేల నడుచుకోవాలని పార్టీలు మారుతూ ప్రజల్లో చులకన కాకూడదని తనపై నమ్మకంతో తనను నమ్మివచ్చిన ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా అండగా ఉంటానని రబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, స్థానల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాలనీ తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న గ్యారంటీలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు క్లుప్తంగా వివరించాలని ఆ దిశగా ప్రతిఒక్క వార్డ్ సభ్యులు కృషి చేయాలనీ కోరారు..ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు కవిత పరుశురాం, సత్యం, మాజీ వార్డ్ సభ్యులు మర్గాని మాధవి రాజు గౌడ్, కాంగ్రెస్ యూత్ ప్రసిడెంట్ రాజు గౌడ్, యాదయ్య, మహిపాల్, కృష్ణ, గిరి,తదితరులు పాల్గొన్నారు..