ఎలక్ట్రికల్ బైక్ షోరూం ని ప్రారంభించిన మండల అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు
పయనించే సూర్యుడు డిసెంబర్ 15 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం
సుండుపల్లి మండలం పీలేరు రూట్ నందు ఎంపీపీ స్కూల్ ఎదురుగా రిషి డ్రైవ్ ఎలక్ట్రికల్ షోరూమ్ ని ప్రారంభించిన టిడిపి అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం షోరూం ప్రోపరేటర్ బలిజ పల్లి కి చెందిన రిషి మండల అధ్యక్షుడు చప్పిడి రమేష్ నాయుడు కుశాలువా ను కప్పి పూలదండ వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుండుపల్లి మండల టిడిపి నాయకులు బలిజపల్లి టిడిపి నాయకులు, మరియు జనసేన నాయకుడు ఒంటేరు రాజా తదితరులు పాల్గొన్నారు