PS Telugu News
Epaper

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడిగా ఆకాష్ నాయక్

📅 21 Feb 2026 ⏱️ 6:41 PM 📝 తెలంగాణ
Listen to this article

విద్యార్థి హక్కుల కోసం విస్తృతంగా పోరాటం కొనసాగిస్తా.ఆకాష్ నాయక్

( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ (ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు విజయవంతంగా ముగిశాయి.రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థి ప్రతినిధులు, నాయకులు పాల్గొని మహాసభలు విజయ వంతం చేశారు.మహాసభల సందర్భంగా నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శిగా సేవలందిస్తున్న ఆకాష్ నాయక్‌ను ఆయన చేసిన నిరంతర కృషి, విద్యార్థి సమస్యలపై చురుకైన పోరాటాలను గుర్తించి రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆకాష్ నాయక్ మాట్లాడుతూ…తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన జాతీయ మరియు రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం, ఫీజుల భారం తగ్గింపు వంటి అంశాలపై మరింత చురుకుగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.ఆయన ఎన్నిక పట్ల రంగారెడ్డి జిల్లా ఏఐఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు మరియు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. యువ నాయకత్వంతో రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Scroll to Top