PS Telugu News
Epaper

ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యువజన కాంగ్రెస్ కార్యకర్తల వీరంగం సిగ్గుచేటు

📅 24 Feb 2026 ⏱️ 7:04 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించు సూర్యుడు ఫిబ్రవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ

బిజెపి జిల్లా అద్యక్షులు అడబాల మండపేటలో మహిళా మోర్చ ఆద్వర్యంలో యల్లాన శకుంతల అద్యక్షతన మున్సిపల్ ఆపీస్ నుండి కపిలేశ్వరపురం రోడ్లో ర్యాలీ నిర్వహించారు ఈకార్యక్రమానికి జిల్లా అద్యక్షులు అడబాల సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సబ్యులు పాలూరి సత్యానందం పాల్గొని మాట్లాడుతూ దేశరాజధాని డిల్లీలో భారత్ మండపం వేదికగా ఏఐ సమ్మిట్ సమావేశంలో రాహుల్ గాంధీ సూచనలతో యూత్ కాంగ్రెస్ నాయకులు చొక్కాలువిప్పి వీరంగం చేసినవారు పాస్ లతో వచ్చారా,క్యూఆర్ కోడ్ తో లోపలికి ప్రవేశించారా అనేది ఆరాతీసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఇన్నోవేషన్ కు పెద్దపీటవేస్తూ ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఏఐసమ్మిట్ కు భారత్ ఆతిధ్యం ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ఠపాలు చేయాలను కోవడం దేశప్రయోజనాలకు భంగకరమని అన్నారు.ఇటువంటి అంతర్జాతీయంగా దేశప్రతిష్ఠను దెబ్బతీయడం తగదని వార్ని క్షమించరాదని అన్నారు.ఈకార్యక్రమంలో మైనార్టీమోర్చ జిల్లా అద్యక్షులు సాదిక్,సీనియర్ నాయకులు కోనసత్యనారాయణ, జిల్లా ఉపాద్యక్షులు చాట్రాతి రాంబాబు,కోటిపల్లి సాయిరాం,ఐటిసెల్ కన్వీనర్ చుండ్రు సాయిరాం బార్గవ్,,కోటిపల్లి శ్రావణి, మద్దుల రేణుకాదేవి,మండపేట పట్టణ అద్యక్షులు నాళం పణిప్రకాష్, మద్దులసుబ్బారావు,కోటిపల్లి క్రిష్ణ,గురజాపు శ్రీనువాస్,నీలచిన్న కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top