PS Telugu News
Epaper

ఏన్కూరు ప్రెస్ క్లబ్ ఎన్నిక

📅 30 Sep 2025 ⏱️ 6:08 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 30. ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ధీరావత్ సందీప్ నాయక్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక

ఏన్కూరు మండల కేంద్రంలో మంగళవారం ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడిగా ధీరావత్ సందీప్ కుమార్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే గౌరవ సలహాదారులుగా జజ్జురి కృష్ణమాచారి, బాలబత్తుల శివకుమార్, కంభంపాటి శ్రీనివాసరావులను నియమించారు. ఉపాధ్యక్షుల పదవులకు గుగులోత్ భావుసింగ్,నాయక్
మైనపు గోపాల్ రావు ఎంపిక కాగా, ప్రధాన కార్యదర్శులుగా బానోతు గోపికృష్ణ, ఎలుగోటి అశోక్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
సహాయ కార్యదర్శిగా బానోతు రమేష్, కోశాధికారులుగా భూక్యా వినోద్, ఇస్లావత్ నరసింహారావు బాధ్యతలు అందుకున్నారు. ప్రచార కార్యదర్శిగా ముదిగొండ ఠాగూర్, ప్రెస్ క్లబ్ ఇన్‌చార్జిగా ఎస్కే లాల్ జాన్ పాషా నియమితులయ్యారు. సభ్యులుగా మోడేపల్లి గోపికృష్ణ చారి, చంద్రశేఖర్, రాము లను ఎంపిక చేశారు.
కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ధీరావత్ సందీప్ నాయక్ మాట్లాడుతూ, ప్రెస్ క్లబ్‌ను బలోపేతం చేస్తూ పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రజా సమస్యలను నిస్వార్థంగా వెలుగులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. కొత్త కార్యవర్గ సభ్యులు తమకు ఇచ్చిన గౌరవానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఏకగ్రీవ ఎన్నికలు జరగడం ప్రెస్ క్లబ్ ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.

Scroll to Top