ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవం

July 14, 2026 | ఆంధ్రప్రదేశ్

ప యనించే సూర్యుడుజూలై 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాకినాడలో 1000 మంది విద్యార్థులతో శోభాయాత్ర కాకినాడ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 78వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ నగర శాఖ ఆధ్వర్యంలో భారీ శోభాయాత్ర నిర్వహించారు.ఈరోజు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి బాలాజీ చెరువు వరకు సుమారు 1000 మంది విద్యార్థులతో శోభాయాత్ర కొనసాగింది. జాతీయ జెండాలు, కాషాయ జెండాలు, బ్యానర్లతో విద్యార్థులు ర్యాలీగా బయలుదేరారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ విద్యార్థులు కూడా పాల్గొని విద్యార్థులతో కలిసి నడిచారు. విద్యార్థి శక్తి, దేశ భక్తి నినాదాలతో నగరం మార్మోగింది.కార్యక్రమం చివరలో బాలాజీ చెరువు వద్ద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దేశ సేవ, సంస్కార విద్య, సమాజ సేవపై నాయకులు దిశానిర్దేశం చేశారు.ఈ శోభాయాత్రలో నగరంలోని వివిధ కళాశాలల విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper