భీంగల్ మండల కేంద్రంలో అభివృద్ధి పనులపై కీలక ప్రకటనలు*
పయనించే సూర్యుడుD.14.7.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గం లోభీంగల్ మండల కేంద్రంలో ఈరోజు మంగళవారం రోజున నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రాంత అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను వెల్లడించారు.ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కన్నె సురేందర్ మాట్లాడుతూ భీంగల్ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి రూ.3 కోట్లు బిల్లు ముందుగానే విడుదలైనట్లు తెలిపారు, అలాగే 4కోట్ల పెండింగ్ బిల్లులు కూడ సంబంధిత శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తో అలాగే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కి మాట్లాడితే సానుకూలంగా స్పందించి త్వరితగతిన ఆ బిల్లులు విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అలాగే నూతన ఎం.ఆర్.ఓ కార్యాలయ భవనం నిర్మాణానికి సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి పరిశీలనలో ఉండగా, త్వరలోనే అనుమతులు మంజూరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణానికి ఇది వరకే 8కోట్ల వరకు వెచ్చించడమే కాకుండా సుందరీకరణ పనులు కోసం మంజూరు ఐన రూ.15 కోట్లకు టెండర్ల ప్రక్రియ పూర్తవడమే కాకుండా పనులు కూడ త్వరలోనే మొదలౌతయాని తెలిపడం జరిగింది . అదేవిధంగా మార్కెట్ యార్డ్ అభివృద్ధి పనులు కూడా త్వరలోనే పనులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. అలాగే పర్యాటక రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ లింబాద్రిగుట్టను టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు హరిత హోటల్ నిర్మాణం కోసం రూ.4 కోట్లు మంజూరైనట్లు తెలిపడమే కాకుండా అతి త్వరలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో శంకుస్థాపన నిర్వహించి, పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ jj నర్సయ్య మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని ఈ అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి అని MLA ప్రశాంత్ రెడ్డి కి సూచించడంతో పాటు గత ప్రభుత్వం హయాంలో చేసిన తప్పులను సరిచేయడానికి సమయం పడుతోందని పదేళ్లు చేసిన తప్పును ఒక్క రోజులో సరిచేయడం ఎవరి వల్లా కాదని హితవు పలకడం జరిగిందిఈ సమావేశంలో మాజీ ఎంపీపీ కన్నె సురేందర్ భీంగల్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సంటి లత జైజై నరసయ్య సందీప్, సంగ్యా నాయక్, నాగేంద్రబాబు, సర్పంచులు సమీర్, జనార్ధన్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బద్దం అవినాష్ గోపాల్ నాయక్ సుంకరి సురేష్, మేకల శ్రీనివాస్, మహేష్, శ్యామ్, మనోజ్, మురారి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.