ఏరుగట్ల మండలంలో అక్రమ ఇసుక బహిరంగ వేలం ఆగస్టు 7న తహసిల్దార్ కార్యాలయంలో వేలం వేయబడును.

August 5, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.5.8.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.బాల్కొండ నియోజకవర్గంలోఎరుగట్ల మండలంలోసమస్త ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఏర్గట్ల మండలము బట్టాపూర్ గ్రామములో ఇటీవల పొలిసు వారు సీజు చేసిన, ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమముగా నిలువ చేసిన సుమారు (40) ట్రాక్టరు ట్రిప్పుల ఇసుకను తహసీల్దార్ కార్యాలయములో తేది. 07-08-2026 రోజున ఉదయము 11-30 గంటలకు బహిరంగ వేలము నిర్వహించబడును. ఇట్టి వేలములో ప్రభుత్వము వారి కనీస ధర ఒక ట్రాక్టరు ట్రిప్పుకు రూ. 2000/- (రెండు వేల రూపాయలు) గా నిర్ణయించడము జరిగినది. ఇట్టి కనీస దర పైన వేలము ప్రారంభము జరుగును. ఇట్టి వేలములో పాలుగొను వారు రూ. 10000/- దరావతు చెల్లించ వలసి ఉందును. ఇట్టి వేలములో పాలుగొను వారు ఈ రోజు మరియు రేపు వేలములోపుగా ఇసుక నిల్వలు బట్టాపూర్ గ్రామములో పరిశీలించు కోగలరు. ఈ వేలంలో అర్హులైన వారు పాల్గొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేయాలని తహసిల్దార్ జె మల్లయ్య ఏర్గట్ల మండలం లో ఒక ప్రకటనలు కోరారు

🌐 Select Language:
📰 ePaper