ఏర్గట్ల మండలంలో బిజెపి నాయకుల అక్రమ అరెస్టు .

July 20, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.20.72026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గంలో ఏరుగట్ల మండలం
ఏర్గట్ల మండల అధ్యక్షుడు గంగారెడ్డి మాట్లాడుతూ…ఆర్మూర్ బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడిని కాంగ్రెస్ వాళ్లు చేస్తే వాళ్లను అరెస్టు చేయాల్సింది పోయి బిజెపి వాళ్లను అరెస్టు చేయడం ఏంది అని నిలదీశారు. అలాగే మాజీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి మాట్లాడుతూ అధికారం ఉంది కదా అని పోలీస్ వ్యవస్థని అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ ఇది సబబు కాదని ఆయన అన్నారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి అధ్యక్షుడు గంగారెడ్డి తో పాటు మాజీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి ని అలాగే బూత్ కమిటీ సభ్యులు గుండ విట్టల్ జక్కం వంశీ మరియు పడకండి నరసారెడ్డి ను అరెస్టు చేశారు.

🌐 Select Language:
📰 ePaper