సినిమా వార్తలు

అమలాపురం 28వ వార్డులో బీజేపీ అభ్యర్థి మోకా వెంకట సుబ్బారావు ఘన విజయం

అమలాపురం 28వ వార్డులో బీజేపీ అభ్యర్థి మోకా వెంకట సుబ్బారావు ఘన విజయం

పయ నించే సూర్యుడు నవంబర్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: అమలాపురం మున్సిపాలిటీ 28వ వార్డు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మోకా వెంకట సుబ్బారావు 110 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ విజయంతో వార్డులో బీజేపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తన విజయానికి కృషి చేసిన కూటమి నాయకులకు, బీజేపీ జిల్లా, మండల, నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు మోకా వెంకట సుబ్బారావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తనను ఆదరించి ఆశీర్వదించి గెలిపించిన ప్రతి ఓటరుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో రేయింబవళ్లు శ్రమించిన ప్రతి కార్యకర్త రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని, వార్డులో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS