PS Telugu News
Epaper

ఏసీబీ కి చిక్కిన అవినీతి ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్.

📅 28 Nov 2025 ⏱️ 1:44 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్

తెలంగాణ నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని యోగేశ్వర్ కాలనీలో గురువారం రోజు సాయంత్రం ఆర్మూర్ కమిషనర్ రాజు అద్దెకు ఉంటున్న ఇంట్లో ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. ఆర్మూర్ లో నూతన గృహ నిర్మాణాo చేపట్టి ఇంటి నంబర్ కొరకు మున్సిపల్ కమిషనర్ ను సంప్రదించగా ఆయన ఇంటి నెంబర్ కొరకు లంచం కోరారని ఏసీబీ అధికారులకు తెలుపగా వారు సోదరులు నిర్వహించి వ్యక్తిగత డ్రైవర్ భూమేష్ కు 20000 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా డ్రైవర్ వద్ద గల బ్యాగును సోదా చేయగా బ్యాగ్ లో గల నగదు 4లక్షల.30 వేల రూపాయలు గురించి ఆరతీయగా రూపాయల గురించి వివరణ కోరగా సరియైన సమాధానం ఇవ్వని కమిషనర్. దాంతో ఆయన ఈ అవినీతిలో పాల్పడ్డారని నిర్ధారించారు.

Scroll to Top