PS Telugu News
Epaper

ఏసీబీ కి చిక్కిన అవినీతి ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్.

📅 28 Nov 2025 ⏱️ 1:52 PM 📝 HOME
Listen to this article

పాఠశాలల పర్యవేక్షణ లేదు

జల్సాలతో రోజులు గడుపుతున్న ఎస్ సి ఆర్ పి

బాధ్యత వద్దు… జీతం ముద్దు తీరుగా ఎస్ సి ఆర్ పి వ్యవహారం

కొత్తగూడెం లో నివాసం ఉంటూ పినపాక మండలం లో విధులకు ఎగనామం పెడుతున్న వైనం.

పయనించే సూర్యుడు నవంబర్ 28, పినపాక ప్రతినిధి,

అన్నపురెడ్డి మండలం కి చెందిన జీ పీ ఎస్ పాఠశాల ఉపాధ్యాయునిగా జీతాలు తీసుకుంటూ డిప్యుటేషన్ పై పినపాక మండలం లో ని ఎల్చిరెడ్డి పల్లి బాలికల ఆశ్రమ పాఠశాల పే సెంటర్ కి స్కూల్ కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్ గా విధులు నిర్వహిస్తున్నారు. మండలంలోని ఏల్చిరెడ్డి పల్లి బాలికల ఆశ్రమ పాఠశాల పే సెంటర్ పరిధిలో తొమ్మిది పాఠశాలలకు రెండు మండలాలు పినపాక లో 8, కరకగూడెం లో 1 పాఠశాలలపై పర్యవేక్షణ, ఉపాధ్యాయుల పనితీరు,విద్యార్థుల ప్రగతిపై,దృష్టి పెట్టాలి. కానీ ఈ ఎస్ సి ఆర్ పి జల్సాలతో విందు వినోధాలతో విధులకు గైర్హాజరవుతూ పాఠశాల విధులను విస్మరిస్తున్నాడని ఇలా నెల జీతాలు మాత్రం తీసుకుంటున్నాడని పక్కా సమాచారం. ఈ ఎస్ సి ఆర్ పి రోజుకి 1 నుండి 2 పాఠశాలలో పర్యవేక్షణ చేసి వాటి యొక్క ప్రగతిని ఐటిడిఏ డిడి, ఏ సి యం వో కు సమర్పించాలి కానీ విధులకు గైర్హాహాజరవుతున్న ఈ యొక్క ఎస్ సి ఆర్ పి పై అధికారులతో ఏవిధంగా సమన్వయం చేసుకుంటూ జీతాలు పొందుతున్నాడో వారికే తెలియాలి.ఎస్ సి ఆర్ పి గా నిర్వహించాల్సిన బాధ్యతలు…..ఎస్ సి ఆర్ పి లు ఉపాధ్యాయులకు అకడమిక్ సహాయం, నాణ్యమైన విద్యాబోధన కి పరిరక్షణ వంటి అనేక బాధ్యతలు ఉంటాయి. సాధారణంగా అకాడమిక్ మానిటరింగ్,సపోర్ట్,కాంప్లెక్స్‌లోని పాఠశాలలను పర్యవేక్షించడం, ఉపాధ్యాయులకు బోధన అభ్యసన ప్రక్రియలో మార్గదర్శనం చేయడం.క్లాస్ రూమ్ పరిశీలన చేసి, బోధనావిధానాలను మెరుగుపరచడానికి సూచనలు ఇవ్వడం.ఉపాధ్యాయుల సామర్థ్యాలను వృద్ధి పరిచే విధంగా ఉపాధ్యాయుల కోసం శిక్షణా తరగతులు, వర్క్‌షాపులు, డెమో క్లాసులు నిర్వహించడం, నూతన శిక్షణా పద్ధతులు, టీ ఎల్ ఎం మేళాల నిర్వహణ, డిజిటల్ టూల్స్ వినియోగం పై అవగాహన కల్పించడం లాంటివి చేయాలి. అభ్యసన ఫలితాలు ను విశ్లేషించి, బలహీన విద్యార్థుల కోసం చర్యలు సూచించాలి. బోధనా సామగ్రి వినియోగం, పరిశుభ్రత వంటి అంశాలను పర్యవేక్షించడం చేయాలి, తల్లిదండ్రులు, పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలి, విద్యార్థుల హాజరు, డ్రాప్ అవుట్ నివారణలో సమన్వయం చేయడం, విద్యాశాఖ అందించే అన్ని కార్యక్రమాలు, పరీక్షా విధానాలు, శిక్షణలు సమయానికి అమలు అయ్యేలా చూడటం.మానవ వనరుల, బడ్జెట్, వనరుల వినియోగం పై మార్గదర్శకాలు ఇవ్వడం.పర్యటనల రిపోర్టులు, మీటింగ్ మినిట్స్, అకాడమిక్ మానిటరింగ్ రిపోర్టులు తయారు చేసి సమర్పించడం ప్రతిభావంతుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు సూచించడం,బలహీన విద్యార్థుల కోసం రెమీడియల్ టీచింగ్ కార్యక్రమాలు చేపట్టడానికి ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేయాలి, ఇన్ని రకాల బాధ్యతలను రోజువారి పర్యవేక్షించి టూర్ డైరీ,జాబ్ డన్ రిపోర్టు లు తయారుచేసి పై అధికారులకు అందించాలి.ఎస్ సి ఆర్ పి పై వస్తున్న ఆరోపణలు.ఎస్ సి ఆర్ పి గా విధులు నిర్వహించాలి అంటే పే సెంటర్ పరిధిలోనే నివాసం ఉండాలి. కానీ పర్యవేక్షించడానికి ప్రతిరోజు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడెం నుండి రాకపోకలు కొనసాగిస్తున్నారు.మండలంలో ఉన్న గిరిజన పాఠశాలలపై పర్యవేక్షణ లేదని విధులకు గైర్హాజరవుతూ విందు వినోదాలతో రోజులు గడుపుతూ పే సెంటర్లో మాత్రం దొంగ సంతకాలు చేస్తూ అప్పుడప్పుడు కనిపిస్తూ, దొంగ రిపోర్టులు ఇస్తూ నెల నెల జీతం మాత్రం కచ్చితంగా పొందుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి.ఎస్ సి ఆర్ పీ లకు ఎఫ్ టీ ఏ గా నెలకు ఎనిమిది వందల రూపాయలు ప్రభుత్వం ఇస్తుండగా ఇతను ప్రతీ రోజూ పినపాక మండలానికి కొత్తగూడెం నుండి రాకపోకలకు కనీసంరోజూ మూడు వందలు ఖర్చు అవుతుంది కానీ ప్రభుత్వం నెలకు ఇచ్చేది ఎనిమిది వందలు మాత్రమే ఈవిధంగా అతనికి అయ్యే ఖర్చు పాఠశాలలు నెలకు సెలవులు పోను ఇరవై అయిదు రోజులు పని చేసినచో అతనికి బస్ చార్జీలు ఏడువేల అయిదు వందల రూపాయలు అవుతాయి దీనిని బట్టే అతను తన యొక్క విధులు ఏవిధంగా నిర్వహించచున్నాడో అర్థం అవుతున్నది, ఇతని నియామకం జరిగి ఒక సంవత్సరం అవుతున్న సంవత్సరం మొత్తం మీద కనీసం అరవై రోజులు కూడా తన విధులను నిర్వహించలేదని ఉపాధ్యయ వర్గాలే చెపుతున్నాయి, నెలలో ఒక్క రోజుకూడా ప్రార్ధనా సమయానికి పాఠశాలను సందర్శించినది లేదు అని ‘మానీ’యమ్మ ఆశీస్సులతో ఎస్ సి ఆర్ పీ బాధ్యతలు చేపట్టిన ఇతను వంద కిలోమీటర్ల దూరం నుండి పినపాక కి వచ్చి, విధులకు ఎగనామం పెడితే ఎలా అని అడిగిన వారికి ఏ సి ఎం ఓ రమేష్ మరియు డి డి అశోక్ లాంటి వారు నా వెనుక ఉన్నారు నన్ను ఎవరూ ఏమి చేయలేరు అని ఎక్కువ చేస్తే పై అధికారులతో మీ పాఠశాల ల గురించి చెడుగా చెప్పి మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా చేస్తా అని భయభ్రాంతులకు గురిచేస్తూ తన పబ్బం గడుపుకుంటున్నారు అని వాపోయారు, ఎస్ సి ఆర్ పి పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని పాఠశాలల ఉపాధ్యాయులు వేచి చూస్తున్నారు.విధులకు ఎగనామం పెట్టటమే కాక, ఐ టీ డి ఏ పరిధిలో ఏ కార్యక్రమం జరిగిన అక్కడ హడావుడి చేస్తూ మొత్తం తనే నపిస్తున్నట్టు, అతను నిజాయితీగా విధులను నిర్వహిస్తున్నట్లు నటిస్తూ అధికారులను నమ్మిస్తూ పబ్బం గడుపుకోవటము తో పాటు అతని విధులకు ఎగనామం పెట్టటమే అతని నైజం, ఎల్చిరెడ్డిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనుబంధ పాఠశాలలను సరిగా పర్యవేక్షణ చేయరు అని అతని వాళ్లే పాఠశాలలు బాగా పనిచేస్తున్నాయి అని ఉపాధ్యాయుల మరియు జీ పీ ఎస్ పాఠశాల ల అభివృద్ధి కి తనే కారణం అని అందరికీ చెప్పుకుంటూ అతని విధులకు మంగళం పాడుతున్నారని ప్రధానోపాధ్యాయురాలు యొక్క మంచి తనాన్ని అలుసుగా తీసుకుని దందాలు చేస్తున్నారు అని ఇతను దాదాపు పది సంవత్సరాలు పనిచేసిన కారకగూడెం మండలం లో ఎవరిని అడిగినా ఇతగాడి లీలలు కథలు కథలుగా చెపుతున్నారు, ఏ రోజూ ఉపాధ్యాయునిగా సరిగా విధులు నిర్వహించడం చేతకాని ఇతనికి ఎస్ సి ఆర్ పీ బాధ్యతలు అప్పగించటం దొంగచేతికి తాళాలు ఇచ్చినట్టే అని అంటున్నారు ఇటువంటి ప్రబుద్ధునిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో అని ఉపాధ్యాయులు , విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.

Scroll to Top