PS Telugu News
Epaper

ఐఐటీ బాంబే ‘ఆకార్’ నేషనల్ ఫెస్ట్‌లో ఆర్జీయూకేటీ సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రథమ బహుమతి”

📅 17 Mar 2026 ⏱️ 4:58 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి

ఐఐటీ బాంబేలో మార్చి 15, 2026న నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘ఆకార్’ ఫెస్ట్‌లో బాసర ఆర్జీయూకేటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన మూడు బృందాలు పాల్గొని, ‘ఓపెన్ రోడ్స్ డిజైన్’ పోటీలో ప్రథమ బహుమతి సాధించడం గర్వకారణం. ఐఐటీ బాంబే, బెంట్లీ సిస్టమ్స్ సంయుక్తంగాఈ పోటీని నిర్వహించాయి. ఈ పోటీలో పాల్గొన్న బృందాల వివరాలు:సూపర్ లేటివ్ బృందం: రిత్విక్ గోషికే, మనీషా బండారి, శివ సాయి గణేష్ నీల్రపు.ట్రాన్సిషన్ బృందం: తేజస్విని మల్లోజు, అక్షిత్ రసపల్లి, సిరి మెట్టుపల్లి.ట్రేల్ బ్రేజర్స్ బృందం: మహేష్ గురుస్వామి, వైష్ణవి కర్నాటి, శ్రీకర్ దేవసాని.దేశవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి విద్యాసంస్థల నుంచి వచ్చిన పోటీదారులను ఎదుర్కొని, రోడ్డు మౌలిక సదుపాయాల రూపకల్పనలో మన విద్యార్థులు అసాధారణమైన సాంకేతిక నైపుణ్యం, వినూత్న డిజైన్ దృక్పథం మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను ప్రదర్శించి విశ్వవిద్యాలయానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారు.ఈ అద్భుత విజయం సాధించిన విద్యార్థులను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ & అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ ఇ. మురళీ దర్శన్ అభినందించారు. విద్యార్థుల కఠోర శ్రమ, టీమ్ వర్క్, అంకితభావాన్ని వారు కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇదే విధమైన ప్రతిభను కనబరచాలని వారిని ప్రోత్సహించారు.ఆర్జీయూకేటీ బాసర అధ్యాపకులు, సిబ్బంది కూడా విజేతలకు తమ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, జాతీయ స్థాయి వేదికపై విద్యార్థులు సాధించిన ఈ ఘనత పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Scroll to Top