ఐ. పోలవరం మండలంలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

August 25, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు ఆగస్టు 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గంఐ. పోలవరం మండలంలోని మురమళ్ళ హైస్కూల్ మరియు కొత్త మురమళ్ళ గురుకుల సంక్షేమ పాఠశాల విద్యార్థులకు ఈరోజు గౌరవ ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు& దాట్ల పృధ్వీరాజ్ విద్యార్థుల విద్యాభ్యాసానికి తోడ్పడే ఉద్దేశంతో నోట్ పుస్తకాలు, పెన్నులు, పలకలను అందజేసి సేవా నిరతిని చాటుకున్నారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ తన వంతు కృషి చేస్తానని తెలిపారు. విద్యయే ప్రతి పేద విద్యార్థికి ఉన్నత భవిష్యత్తుకు సోపానమని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

🌐 Select Language:
📰 ePaper