PS Telugu News
Epaper

ఒక చారిత్రాత్మికం కేంద్ర బడ్జెట్__ఎమ్మెల్యే సుబ్బరాజు( బుచ్చిబాబు)

📅 03 Feb 2026 ⏱️ 7:42 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే ఫిబ్రవరి 3 ముమ్మిడివరం ప్రతినిధి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక చరిత్ర ఆత్మ కమిటీ ఇది అన్ని వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరే విధంగా ఉందని ముమ్మిడివరం నియోజవర్గం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) అన్నారు. కేంద్ర బడ్జెట్ పై ఆయన మాట్లాడుతూ దేశాన్ని 2047 నాటికి వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దే దిశగా ఉందని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. ఒకే ప్రధాని హయాంలో తొమ్మిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం అరుదైన ఘనత అని పేర్కొంటూ, నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని తెలిపారు. అలాగే పార్లమెంట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ ప్రసంగం చేసి కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలకు భరోసా ఇచ్చారని చెప్పారు.ప్రపంచ ఆర్థిక పరిణామాలకు అనుగుణంగా దేశాభివృద్ధికి వేగం చేకూర్చేలా ఈ బడ్జెట్‌ను రూపొందించారని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు వివరించారు. వ్యూహాత్మక రంగాల్లో మాన్యుఫాక్చరింగ్ పెంపు, పారిశ్రామిక వారసత్వ పునరుద్ధరణ, ఎం ఎస్ ఎం ఈ ను జాతీయ స్థాయి చాంపియన్లుగా తీర్చిదిద్దడం, మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం, సిటీ ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధి వంటి ఆరు కీలక సూత్రాలపై ఈ బడ్జెట్ ఆధారపడిందన్నారు.ఈరోజు బడ్జెట్‌లో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు:మౌలిక సదుపాయాల రంగానికి భారీ కేటాయింపులు చేసి జాతీయ రహదారులు, రైల్వే నెట్‌వర్క్, పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ప్రాధాన్యత
గృహ నిర్మాణ రంగానికి మరింత ఊతం ఇచ్చేలా పట్టణ, గ్రామీణ గృహ పథకాలకు అధిక నిధులు
రైతుల ఆదాయం పెంపునకు సాగునీటి ప్రాజెక్టులు, ప్రకృతి వ్యవసాయం, రైతు ఉత్పత్తి సంస్థలకు మద్దతు
మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణ పరిమితి పెంపు, మహిళా సాధికారతకు ప్రత్యేక కార్యక్రమాలు
యువతకు నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లకు ప్రోత్సాహం, డిజిటల్ ఇండియా విస్తరణ గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతు ఇచ్చే విధానాలు రక్షణ రంగంలో స్వదేశీ తయారీ పెంపు, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి బలమైన చర్యలు వ్యవసాయం, రక్షణ, విద్య, వైద్యం, గ్రామీణ–పట్టణాభివృద్ధి, సామాజిక సంక్షేమం వంటి రంగాలకు సముచిత కేటాయింపులు చేసి అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులకు రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఇవ్వడం మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయమని అన్నారు. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సకు అవసరమైన వైద్య వసతులు మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌కు ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యం లభించిందని దాట్ల సుబ్బరాజు చెప్పారు. జిల్లాకో గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత విద్యా కోర్సులకు ప్రోత్సాహం, అమరావతి రాజధాని అభివృద్ధికి ఏడీబీ నిధులుగా రూ.1,128.91 కోట్లు, అమరావతి సమగ్ర పట్టణాభివృద్ధికి జపాన్ నిధులు, గ్రామీణ రహదారి ప్రాజెక్టులు, పట్టణ తాగునీరు–మురుగు నీటి పారుదల, పోలవరం ప్రాజెక్టుకు భారీ కేటాయింపులు రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయని అన్నారు.ఏపీలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు విశ్వాసం వ్యక్తం చేశారు.

Scroll to Top