PS Telugu News
Epaper

ఓటు హక్కు దారుడా సమాజాన్ని మార్చే సూర్యుడా???

📅 30 Sep 2025 ⏱️ 3:45 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

కెవి నరసింహ సమాచార హక్కు చట్టం కార్యకర్త ఎం జె పి వి సి వ్యవస్థాపకులు

{పయనించే సూర్యుడు} {సెప్టెంబర్ 30} మక్తల్

ఓటు హక్కుదారులకు నమస్కారం త్వరలో జరగబోయే స్థానిక ఎలక్షన్లలో మీ ఓటు వేసి సమాజాన్ని మార్చే సూర్యలకు ప్రత్యేక అభినందనలు అంటూ కె వి నరసింహ అన్నారు భారత దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలని అలాగే ఈ ఓటు హక్కుతో నవ సమాజ నిర్మాణం చేసుకోవాలి అని అందులో ప్రతి ఒక్కరు భాగ్య స్వామ్యం కావాలని ఆయన అన్నారు అయితే ఓటు రావడానికి కృషి చేసిన వారి త్యాగాలను ఒకసారి గుర్తు చేసుకుందాం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించడం జరిగింది అయితే ఈ ఓటు అయితే గ్రామాలలో ఓటు వేసే పరిస్థితి అంబేద్కర్ గారు చాలా బాడుగు బలహీన వర్గాల వారు ఓటు వేయడానికి భయపడతారనే ఉద్దేశంతో ఓటు హక్కుదారుడు పోలింగ్ బూత్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరు చూడకుండా నాలుగు మూలల తెరను కట్టించి నిర్భయంగా నీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకుని బాటును స్వేచ్ఛను అంబేద్కర్ కల్పించారు అని ఓటు వేసే క్రమంలో ఎవరి ఒత్తిడి గాని బెదిరింపులకు గాని భయాందోళనకు గాని గురికాకుండా ఓటు వేసుకోవచ్చని అంబేద్కర్ వివరించారు మనకు స్వేచ్ఛ సమానత్వం కూడినటువంటి ఓటును వేసి సరైన నాయకులను ఎన్నుకునే అధికారం 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరి చేతిలో వజ్రాయుధం లో పెట్టాడు అంబేద్కర్ అన్నారు ఆయన అలాంటి ఓటును ఓటు వేసే ప్రతి ఒక్కరు మందు సీసాలకు పాల ప్యాకెట్లకి చీర జాకెట్లకు అమ్ముకోకుండా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపే నాయకులకు ఓటు వేసి గెలిపించుకోవాలని అన్నారు కెవి నరసింహ సమాచార హక్కు చట్టం కార్యకర్త మహాత్మా జ్యోతిబా పూలె వారధి కమిటీ వ్యవస్థాపకులు

Scroll to Top