PS Telugu News
Epaper

కడియాల కుంట తండా ప్రీమియర్ లీగ్ సీజన్ 3 విజేతగా ఎస్ ఆర్ హెచ్

📅 12 Jan 2026 ⏱️ 6:24 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

రన్నర్ గా సీఎస్కే టీం

బహుమతులు అందజేసిన మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్

పాల్గొన్న గ్రామ వార్డు సభ్యులు

( పయనించే సూర్యుడు జనవరి 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

గత మూడు రోజులుగా జరుగుతున్న కడియాల కుంట తండా ప్రీమియర్ లీగ్ సీజన్ 3 నేటితో ఘనంగా ముగిశాయి. ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా ప్రీమియర్ లీగ్ సీజన్ 3 విజేతగా ఎస్ ఆర్ హెచ్ టీం మరియు రన్నర్ గా సీఎస్కే నిలిచింది. సీజన్ ఉత్తమ బ్యాట్ మ్యాన్ గా నేనావత్ సందీప్ నాయక్ నిలవగా ఉత్తమ బౌలర్ గా పాల్త్యవత్ గణేష్ నిలచారు. అనంతరం విజేతలకు కడియాల కుంట తండా మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్ బహుమతులను అందజేయడం జరిగింది. బహుమతుల స్పాన్సర్ గా వివో రాజు నాయక్, జెర్సీ స్పాన్సర్ గా తావు సింగ్, చాట్ పట రవీందర్ నాయక్, వినోద్ నాయక్, సిద్దు నాయక్, రాత్లవత్ వినోద్ నాయక్,శివ నాయక్ జెర్సీలను అందజేశారు. అనంతరం మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్ మాట్లాడుతూ… యువకులు ఉన్నత స్థాయికి ఎదగాలని మరియు క్రీడాకారులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఏ సహాయమైనా చేస్తానని అన్నారూ. విద్యార్థులు జిల్లా రాష్ట్రస్థాయిలో రాణించాలని క్రీడాకారులకు అయ్యే సహాయ సహకారాలను ఎల్లవేళలా అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బుజ్జి రాజు నాయక్ తో పాటు, వార్డు సభ్యులు తావు సింగ్ నాయక్, చాట్ పట రవీందర్ నాయక్, నీలా భాస్కర్ నాయక్, ప్రియాంక దేవేందర్ నాయక్, వివో రాజు నాయక్, మరియు క్రీడాకారులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top