కడియాల కుంట తండా 1 మరియు 6 వార్డు అభ్యర్థులు ఏకగ్రీవం
( పయనించే సూర్యుడు డిసెంబర్ 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం కడియాలకుంట తండా గ్రామపంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామపంచాయతీ పరిధిలోని 1వ వార్డు మరియు 6 వార్డు ఏకగ్రీవం కావడం జరిగింది. ఒకటో వార్డ్ మెంబర్గా తవ్ సింగ్ నాయక్ మరియు ఆరవ వార్డు మెంబర్గా చాట్ పట రవీందర్ నాయక్ ఎన్నికవ్వడం జరిగింది. అనంతరం ఏకగ్రీవమైన వార్డు సభ్యులు తమ వార్డును అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని తమపై నమ్మకంతో ఇచ్చిన ఈ పదవిని ఎంతో బాధ్యత యుతంగా మరియు అందరికీ అందుబాటులో ఉండే తమ వార్డు అభివృద్ధి చెందే దిశగా కృషి చేస్తామని తెలిపారు.
