కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మహమ్మద్ అలీ షబ్బీర్
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి.కె గంగాధర్
నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వసలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మరియు పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వం అప్పుల కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది ఈరోజు షాది ముబారక్ 481లబ్ధిదారులకు 4 కోట్ల 81 లక్షల 55వేల 796 రూపాయలు కళ్యాణ లక్ష్మి 187 లబ్ధిదారులకు 1కోటి 87లక్షల 21 వేయి 692 రూపాయలు దాదాపు 8 కోట్ల వరకు పంచడం జరిగింది ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులలో ఉన్న ఇచ్చిన మాట ప్రకారం పథకాలన్నీ అమలు చేస్తున్నాం 500 కు సిలిండర్ 200 యూనిట్ల విద్యుత్ ఉచితం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇంద్రమ్మ ఇల్లు రైతు రుణమాఫీ రైతు భరోసా యువతకు ఉద్యోగాలు సన్న బియ్యం పథకాలు అమలు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ హందన్ ఎన్ యు డి ఏ చైర్మన్ కేశ వేణు మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
