కవితను అరెస్ట్ చేసిన అధికారులు – జాగృతి నేతల ఆందోళన!
పయనించే సూర్యుడు న్యూస్ :తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్టయ్యారు. కామారెడ్డిలో కవిత ఆధ్వర్యంలో రైలురోకో నిర్వహించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. కవితతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు రైలు పట్టాలపై బైఠాయించిన నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు పలువురు జాగృతి నేతలను పోలీసులు అరెస్టు చేశారు.రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఇక ఈ క్రమంలో కామారెడ్డి జిల్లాలో కవితతో పాటు జాగృతి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, రైలు పట్టాలపై రైల్ రోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ..రైలు పట్టాలపై బైఠాయించారు. దీంతో అప్రమత్తమైన కామారెడ్డి పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది కవితతో పాటు జాగృతి నాయకులను అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. ఈనేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణ నెలకొన్నాయి. కవిత, పలువురు జాగృతి నేతలను పోలీసులు అరెస్టు స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించారు.