కాంగ్రెస్ కలర్ వేసుకున్న వారు ముఖ్యమా కాంగ్రెస్ కండువా వేసుకున్న వారు ముఖ్యమా. డిసిసి అధ్యక్షా…
పయనించే సూర్యుడు తేదీ 29 డిసెంబర్ సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా ఇన్చార్జి బోయ కిష్టన్న.
అయ్యా డీసీసీ అధ్యక్షా పార్టీ క్రమశిక్షణ గురించి నువ్వు చెప్పడం చాలా వింతగా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకోవడానికి భయపడి వెనక్కి జరుగుతున్నటువంటి నాయకుల చెంతకు నువ్వు చేరి కనీసం నీ భుజంపై ఉన్న కండువా కూడ దాచిపెట్టుకునే పరిస్థితి తెచ్చుకున్న నువ్వెక్కడ
నికార్సైన నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సరితమ్మ కార్యకర్తలమని ధైర్యంగా కండువా కప్పుకుని కార్యక్రమాలు చేసే మేమెక్కడ మాకు మీకు చాలా తేడా ఉంది అద్యక్షా.నీకు డిసిసి అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గారే స్వయానా బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అని చెప్పినటువంటి వ్యక్తిని నువ్వు కలవడం ఎంతవరకు సబబు ఇది దేనికి సంకేతం బహుజన నాయకురాలు బీసీల ముద్దుబిడ్డ గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దాదాపు 90 వేల మంది మన్ననలు పొందిన శ్రీమతి సరితమ్మని నివ్వు ఇంత వరకు దేనికొరకుకలువలేదు అన్న విషయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నీవు చెప్పాల్సిన అవసరం ఉంది అద్యక్షా ఇది విద్వత్ గద్వాల అద్యక్షా ప్రజలు అన్ని గమనిస్తునారు ఇటువంటి కుట్రలు కుతంత్రాలు గద్వాల ప్రజలముందు నడువదు అద్యక్షా
ప్రజలు సమయం కొరకు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు తగిన బుద్దిచెప్పడానికి అద్యక్షా.