PS Telugu News
Epaper

కాంగ్రెస్ కార్యకర్తకు అండగా నిలిచిన కాసాల జనార్దన్ రెడ్డి.

📅 24 Feb 2026 ⏱️ 11:22 AM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు తాము ఎల్లప్పుడూఅండగా ఉంటా
కాసాల జనార్దన్ రెడ్డి .

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 24.

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం, చండూరు మండలం గుండ్రపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పట్ల వెంకన్న ఉపాధి కోసం, తన వ్యాపార అవసరాల నిమిత్తం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం జనార్దన్ రెడ్డి దృష్టికి వచ్చింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన, సోమవారం వెంకన్నకు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు,ఈ సందర్భంగా కాసాల జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ…”పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న సీనియర్ కార్యకర్తలే పార్టీకి అసలైన బలం. పట్ల వెంకన్న వంటి నిబద్ధత గల కార్యకర్తలకు అండగా ఉండటం మన బాధ్యత. వారి ఆర్థిక ఎదుగుదలకు చిన్నపాటి తోడ్పాటు అందించడం సంతోషంగా ఉంది,” అని పేర్కొన్నారు..తమకు అండగా నిలిచినందుకు పట్ల వెంకన్న మరియు ఆయన కుటుంబ సభ్యులు జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గుండ్రపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు, ఇందిరమ్మ గృహ కమిటీ సభ్యులు కాసాల పాండురంగారెడ్డి,ఇందిరమ్మ గృహ కమిటీ సభ్యులు వందనపు నరేందర్,4వ వార్డు సభ్యుడు తిరుమణి శ్రీనివాసులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కట్కూరి రంగారెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూతరాజు జంగయ్య,కట్కూరి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు భూతరాజు శేఖర్, భూతరాజు సుక్కయ్య,గ్రామ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top