PS Telugu News
Epaper

కాంగ్రెస్ తోనే నిరుపేదల కల సాకారం

📅 20 Feb 2026 ⏱️ 7:14 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

నందిగామ,కొత్తూరు మండలం లో సుడిగాలి పర్యటన

కొత్తూరు మండలంలో 9.92 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే

( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేదల కల సాకారం అవుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.నందిగామ, కొత్తూరు మండలంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం దశలవారీగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామని అన్నారు. ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఇండ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు.కొత్తూరు మండల పర్యటనలో భాగంగా 9.00 లక్షల హెచ్ ఏం డిఏ నిధులతో పెద్దగుట్ట తాండ లో డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్టాపన చేశారు.అలాగే ౩ కోట్ల గిరిజన సంక్షేమ శాఖ నిధులతో గూడూరు నుండి పెద్దగుట్ట తాండ కు బీటి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. గూడూరు గ్రామంలో 10 లక్షలతో (హెచ్ఏండిఏ నిధులతో) సిసి రోడ్డు , 8 లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.గూడూరు గ్రామంలో 10 లక్షల హెచ్ఏండిఏ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు.5.75 కోట్లతో తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ నుండి గూడూరు వరకు బీటి రోడ్డు , 75.00 లక్షలతో రెడ్డిపాలెం గేట్ నుండి రాగ్య తాండ వరకు బిటి రోడ్డు, అలాగే రెడ్డిపాలెం గ్రామంలో 15 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ కొత్తూరు పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షులు కొమ్ము కృష్ణ, నందిగామ పార్టీ మండల అధ్యక్షుడు జంగ నర్సింహులు యాదవ్, చేగూర్ సర్పంచి మంకాల శ్రీశైలం, నర్సప్పగూడ మాజీ సర్పంచ్ కావాలి కృష్ణ, మాజీ ఎంపీటీసీలు చంద్రపాల్ రెడ్డి,దేపల్లి కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top