కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం…- ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్…
రుద్రూర్, డిసెంబర్ 3 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు అన్నీ విధాలుగా ఆదుకుంటున్నారని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, వైట్ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు ఇలా అనేక పథకాలను ప్రవేశపెట్టి అండగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగయిందని అన్నారు. కొన్ని గ్రామాలల్లో బిజెపి పార్టీ కొంత మేరకే ఉందని స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ సర్పంచ్ ఎన్నికలలో బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 100 కు 100 శాతం గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి బలపర్చిన అభ్యర్థి బద్దం వసంత – సంజీవ్ రెడ్డికి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జడ్పిటీసి నారోజీ గంగారాం, పత్తి రాము, పార్వతి ప్రవీణ్, తోట్ల గంగారాం, సీనియర్ నాయకులు అక్కపల్లి నాగేందర్, షేక్ సుభాని పార్టీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.