
రుద్రూర్, నవంబర్ 1 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.నవీన్ యాదవ్ గెలుపు కొరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం, శైక్పేట్ డివిజన్ 24వ బూత్ ఇంచార్జ్ ఇందూర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, మండల నాయకులు షేక్ నిస్సార్, గౌస్, ఇందూర్ కార్తీక్, పార్వతి ప్రవీణ్, గాండ్ల శ్రీను, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.