కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై మక్తల్ లో బీఆర్ఎస్ సమరభరి..
నల్లజానమ్మ దేవాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ..
కాంగ్రెస్ 420 హామీలపై 420 అడుగుల ఫ్లెక్సీతో నిరసన..
: పయనించే సూర్యుడు సెప్టెంబర్ 3మక్తల్:తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనకు నిరసనగ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపుమేరకు బుధవారం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు మక్తల్ పట్టణంలోని నల్లజానమ్మ దేవాలయం నుంచి బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూకాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. భారీ ర్యాలీలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ప్రదర్శిస్తూ 420 అడుగుల పొడవైన ఫ్లెక్సీతో ఆందోళన చేపట్టారు. 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇంకా అమలు చేయాల్సిన, ప్రజలకు చెల్లించాల్సిన హామీల వివరాలతో కూడిన ‘బాకీ కార్డులను’ ఇంటింటికీ పంపిణీ చేయాలనిమండల కేంద్రాల నుంచి నియోజకవర్గ కేంద్రం వరకు పార్టీ కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ నిరంతరం పోరాడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని అన్నారు. మహిళలకు నెలకు రూ 2.500 ఆర్థిక సహాయం తులం బంగారం రైతు బీమా నిరుద్యోగ భృతి దళిత బంధు రుణమాఫీ తదితర హామీల అమలు ఊసే లేకుండా పోయిందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు బీఆర్ఎస్ సమరభేరి కార్యక్రమం చేస్తుంటే కరెంటు సైతం తొలగించారని ఆరోపించారు బీఆర్ఎస్ శ్రేణులపట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం లోని అన్ని మండలాలకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు వందలాదిగా పాల్గొన్నారు బీఆర్ఎస్ శ్రేణులు ప్లకార్డులు పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ప్లెక్సీని ప్రదర్శించారు.